Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 4:21 - పవిత్ర బైబిల్

21 ఎదోము ప్రజలారా, సంతోషంగా ఉండండి, ఆనందించండి. ఊజు రాజ్యంలో నివసించే ప్రజలారా, సంతోషంగా వుండండి. కాని ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. యెహోవా కోపపు గిన్నె మీవద్దకు కూడా వస్తుంది. మీరు దానిని తాగినప్పుడు, మీకు మత్తెక్కుతుంది. ఆ మత్తులో మిమ్మల్ని మీరు దిగంబరులుగా చేసుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 –అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 “అతని నీడ కింద అన్యప్రజల మధ్య బతుకుదాం” అని మేము ఎవరి గురించి అనుకున్నామో వాడు శత్రువుల చేజిక్కాడు. ఊజు దేశంలో నివాసం ఉన్న ఎదోము కుమారీ, సంతోషించు, ఉల్లాసంగా ఉండు. ఈ గిన్నెలోది తాగే వంతు నీకూ వస్తుంది. నువ్వు దానిలోది తాగి మత్తుగా ఉండి నిన్ను నువ్వు నగ్నంగా చేసుకుంటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 ఎదోము కుమారీ, ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 ఎదోము కుమారీ, ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 4:21
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.


యూదా రాజైన ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్సహించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పించాడు. యెహోవా పట్ల అతడు అసలు విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు.


ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు.


యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను! యెహోవా, యెరూషలేము పడిన రోజున ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము. దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.


అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి.


యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.”


ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా? ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా? వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు.


నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “మోయాబు, శేయీరు (ఎదోము) ప్రజలు, ‘యూదా వంశం కేవలం ఇతర రాజ్యాల జనుల మాదిరే ఉంది’ అని అంటారు.


“నరపుత్రుడా, యెరూషలేమును గురించి తూరు చెడ్డ విషయాలు చెప్పింది, ‘ఆహా! ప్రజలను రక్షిస్తున్న నగర ద్వారం నాశనం చేయబడింది! నా కొరకు నగర ద్వారం తెరవబడింది. యెరూషలేము నగరం నాశనం చేయబడింది. అందులో నాకు విలువైన వస్తువులు ఎన్నో లభిస్తాయి!’”


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి, తన సోదరుని (ఇశ్రాయేలును) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు.


ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును గురించి ఈ విషయం చెప్పాడు: దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము. వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. “మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.


షాఫీరులో నివసించేవాడా, దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పో! జయనానులో నివసించేవాడు బయటకు వెళ్లడు. బేతేజెలులో ఉన్నవారు విలపిస్తారు. దానికి కావలసిన ఆసరా మీనుండి తీసుకొంటుంది.


“కాని అతడు యెహోవా కోపాన్ని తెలుసుకుంటాడు. ఆకోపం యెహోవా కుడి చేతిలో విషపు గిన్నెలా ఉంటుంది. అతడు ఆ కోపాన్ని రుచిచూచి, తాగిన వానిలా నేలమీద పడతాడు. “దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు.


“జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ