Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 4:17 - పవిత్ర బైబిల్

17 మా కండ్లు పనిచేయటం మానివేశాయి. మేము సహాయం కొరకు నిరీక్షించాము. కాని అది రాలేదు. ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి. ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము. మా కావలి బురుజులపై నుండి మేము చూశాము. కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 వ్యర్థసహాయముకొరకు మేముకనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేముకనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు. రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 4:17
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు నదికి మధ్యగల ప్రదేశమంతటిని స్వాధీనము చేసుకున్నాడు. ఈ ప్రదేశము అంతకు ముందు ఈజిప్టువారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల ఈజిప్టు రాజు ఈజిప్టుని ఏ మాత్రమూ విడువదలచుకోలేదు.


ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”


మరణంతోటి మీ ఒడంబడిక తుడిచి వేయబడుతుంది. పాతాళంతో మీ ఒడంబడిక మీకు సహాయం చేయదు. “ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని తన పాద ధూళిగా చేస్తాడు.


యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి: ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా? నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది? లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది? యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.


నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. అందుచేత అష్షూరును వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.


చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు. అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు. కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు. ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.


మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు: “పంటకోత కాలం అయిపోయింది. వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”


నా ప్రేమికులను నేను పిలిచాను. కాని వారు నన్ను మోసగించారు. నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు. ఆహారం కొరకు వారు అన్వేషించారు. వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.


యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది. పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది. శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది. ఆమెకు కలిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది. ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు. ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.


మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము. తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.


ఇశ్రాయేలు వంశం వారు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించకుండా ఈజిప్టును ఆశ్రయించిన తమ పాపాన్ని వారు గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభువైన యెహోవానని వారు గుర్తిస్తారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ