విలాపవాక్యములు 2:9 - పవిత్ర బైబిల్9 యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి. ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు. ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు. వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు. యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి దర్శనాలు ఏమీలేవు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆమె ద్వారాలు భూమిలోకి కృంగిపోయాయి; ఆయన వాటి బంధాలను పగలగొట్టి నాశనం చేశారు. ఆమె రాజు, ఆమె అధిపతులు దేశాల్లోకి చెరకు కొనిపోబడ్డారు, ఇక ఉపదేశం లేకుండా పోయింది, ఆమె ప్రవక్తలు ఇక యెహోవా నుండి దర్శనాలను పొందుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆమె ద్వారాలు భూమిలోకి కృంగిపోయాయి; ఆయన వాటి బంధాలను పగలగొట్టి నాశనం చేశారు. ఆమె రాజు, ఆమె అధిపతులు దేశాల్లోకి చెరకు కొనిపోబడ్డారు, ఇక ఉపదేశం లేకుండా పోయింది, ఆమె ప్రవక్తలు ఇక యెహోవా నుండి దర్శనాలను పొందుకోలేదు. အခန်းကိုကြည့်ပါ။ |
అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను (దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో చిక్కుకుంటాడు. నేనతనిని కల్దీయుల రాజ్యమైన బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. శత్రువు అతని కన్నులను పీకి గుడ్డివాణ్ణి చేస్తాడు అప్పుడు అక్కడ అతడు చనిపొతాడు.