20 యెహోవా, నావైపు చూడుము! నీవు ఈ రకంగా శిక్షించినది ఎవ్వరినో చూడు! నన్ను ఈ ప్రశ్న అడుగనిమ్ము: తాము కన్న బిడ్డలనే స్త్రీలు తినవలెనా? తాము పెంచి పోషించిన బిడ్డలనే స్త్రీలు తినవలెనా? యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడాలా?
20 నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి శుద్ధాలయమునందు హతులగుట తగునా?
20 యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?
20 “చూడండి, యెహోవా, ఆలోచించండి: మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, తాము పెంచిన పిల్లలను తినాలా? యాజకుడు, ప్రవక్త ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?
20 “చూడండి, యెహోవా, ఆలోచించండి: మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, తాము పెంచిన పిల్లలను తినాలా? యాజకుడు, ప్రవక్త ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?
అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు. బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు.
అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు.
గత కాలంలో ఈ పట్టణం చాలా కలవరంతో నిండి ఉండేది. ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీ ప్రజలు చంపి వేయబడ్డారు. కానీ కత్తులతో కాదు. ప్రజలు మరణించారు కానీ యుద్ధం చేస్తూ కాదు.
శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’
అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’
ప్రవక్తలు అబద్ధం చెప్పటం; యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు నా ప్రజలు దానినే ఆదరించారు. కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు గురియైన నాడు మీరేమి చేస్తారు?”
నా ప్రేమికులను నేను పిలిచాను. కాని వారు నన్ను మోసగించారు. నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు. ఆహారం కొరకు వారు అన్వేషించారు. వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.
యెరూషలేము ప్రవక్తలు పాపం చేసిన నేరానికి ఇది జరిగింది. యెరూషలేము యాజకులు దుష్ట కార్యాలు చేయటం వలన ఇది సంభవించింది. యెరూషలేము నగరంలో ఆ మనుష్యులు రక్తం చిందించుతున్నారు. వారు మంచివారి రక్తాన్ని పారిస్తున్నారు.
యెరూషలేము ప్రజలు చాలా ఆకలితో ఉండి, తండ్రులు వారి బిడ్డలనే తినివేస్తారు. పిల్లలు వారి తండ్రులను తినివేస్తారు. అనేక విధాలుగా మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. చావగా మిగిలిన ప్రజలను నేను అన్ని దిక్కులలో చిందర వందరగా వదిలి వేస్తాను.”
ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడు, “ఈ స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి నగర ప్రజలను చంపివేశారు.
నేను యెహోవాకు ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, ‘యెహోవా దేవా, నీ ప్రజలను నాశనం చేయవద్దు. వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.