2 యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు. కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు. ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు. యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు. ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.
2 ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనముచేసియున్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి యున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యమును దాని యధిపతులను ఆయన అపవిత్ర పరచియున్నాడు.
2 యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమానపరిచాడు.
2 దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.
2 దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.
“నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎవ్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు.
యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు.
అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు. అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు అది ధూళిలో పడిపోతుంది.
ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు. ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు.
“నేను నా ప్రజల మీద కోపగించాను. ఈ ప్రజలు నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను. నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని శిక్షించావు. నీవు వారికి ఎలాంటి దయా చూపించలేదు. వాళ్లు ముసలి వాళ్ల కోసం చాలా కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు.
యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.’ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది ‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.’”
“ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: ‘యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.’”
అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’
“యూదావారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటి మొద్దులను నరికి నాశనం చేయవద్దు). వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు.
యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు. ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చేసివేశాడు. పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూవచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు. దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు. నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు. ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు.
యువకులు, ముసలివారు నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు. నా యువతీ యువకులు కత్తి వేటుకు గురియైనారు. యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు! దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!
యెహోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు.
నా ప్రభువైన యెహోనా ఇలా చెప్పాడు, “యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమైన పనులు చేశావు. దానిని అపవిత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం చూపించను. నిన్ను చూచి నేను విచారపడను!
నీ పట్ల నేను కనికరం చూపను. నిన్ను చూచి విచారించను. నీవు చేసిన చెడ్డకార్యాలకు నిన్ను నేను శిక్షిస్తున్నాను. నీవు ఘోరమైన పనులు చేశావు. నేను యెహోవానని నీవిప్పుడు తెలుసు కొంటావు.”
మీ పట్ల ఏ మాత్రం కనికరం చూపను. మిమ్ముల్ని చూచి విచారపడను. మీరటువంటి భయంకరమైన పాపాలు చేశారు. నేను ప్రభువైన యెహోవానని, నేనే మిమ్ముల్ని కొడతానని మీరు తెలుసుకుంటారు.
వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను విచారించను! వారు ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. కాని వారి అభ్యర్థనను నేను వినను!”
ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చు. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోము దుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.
మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.
“ఈ రాజ్యం మీ పట్టణాలన్నింటినీ చుట్టుముట్టేస్తుంది. మీ పట్టణాల చుట్టూ ఉన్న మీ ఎత్తయిన, బలమైన గోడల్ని మీరు నమ్ముకొంటారు. కానీ మీ దేశం అంతటా ఈ గోడలన్నీ కూలిపోతాయి. అవును, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీ పట్టణాలన్నింటిమీదా ఆ రాజ్యం దాడి చేస్తుంది.