Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 2:12 - పవిత్ర బైబిల్

12 “రొట్టె, ద్రాక్షారసం ఏవి?” అని ఆ పిల్లలు తమ తల్లులను అడుగుతున్నారు. వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 గాయమొందినవారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని–అన్నము ద్రాక్షారసము ఏదియని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచె దరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 పట్టణ వీధుల్లో గాయాలతో పడి ఉన్న వారిలాగా మూర్చపోతూ. “ధాన్యం, ద్రాక్షరసం ఏవి?” అంటూ తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 వారు తమ తల్లులతో, “తినడానికి, త్రాగడానికి ఏమి లేవా?” అని అడుగుతున్నారు, వారు గాయపడిన వారిలా నగర వీధుల్లో మూర్ఛపోతున్నారు, వారి తల్లుల చేతుల్లో వారి ప్రాణాలు పోతున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 వారు తమ తల్లులతో, “తినడానికి, త్రాగడానికి ఏమి లేవా?” అని అడుగుతున్నారు, వారు గాయపడిన వారిలా నగర వీధుల్లో మూర్ఛపోతున్నారు, వారి తల్లుల చేతుల్లో వారి ప్రాణాలు పోతున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 2:12
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది. నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.


కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము. నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం, ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం. అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.


ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి. మీ సమస్యలు దేవునితో చెప్పండి. దేవుడే మన క్షేమ స్థానం.


నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు నేలమీద పడి, అలానే ఉండిపోయారు. ప్రతి వీధిమలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టబడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించబడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను అన్నప్పుడు వారు మరీ బలహీనులై పోయారు.


ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చి మరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించబడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల కోసం విజ్ఞాపన చేసాడు.


మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు. మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం చేస్తారు. వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు. మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు. కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు. మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”


యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు. ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు. ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు. ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు. యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు! ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.”


దాహంతో పసిబిడ్డ నాలుక అంగిట్లో అతుక్కు పోతుంది. చిన్న పిల్లలు అన్నానికి అలమటిస్తారు. కాని వారికి ఎవ్వరూ ఆహారం ఇవ్వరు.


బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ