Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:22 - పవిత్ర బైబిల్

22 “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము. నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు, అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము. పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి. నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను నా మనస్సు క్రుంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక. నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు. నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 “వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 “వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:22
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము! నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను. నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము. సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.


“మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?” అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు. దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము. నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.


ప్రజలు వారి ధైర్యం కోల్పోతారు. భయం ప్రజలను బలహీనులను చేస్తుంది.


నీకు కోపంవస్తే, అన్యదేశాలను శిక్షించుము. వారు నిన్నెరుగరు; గౌరవించరు. ఆ ప్రజలు నిన్ను పూజించరు. ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి. వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు. వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.


యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు. వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు. నా శత్రువులను మట్టు బెట్టు! నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!


ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు! ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నారు. కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు. ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు. అలాగే యితరులు యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు.


మమ్మల్ని బాధించటానికి బబులోను భయంకరమైన పనులు చేసింది. ఇప్పుడు అవన్నీ బబులోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.” సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు చెప్పారు: “బబులోను వారు మా ప్రజలను చంపిన నేరస్థులు. వారు చేసిన దుష్ట కార్యాలకు వారిప్పుడు శిక్షింపబడతారు.” యెరూషలేము నగరం ఆ విషయాలు చెప్పింది.


దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.


యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు ఆ అగ్ని నా ఎముకలకంటింది. ఆయన నా కాళ్లకు వలపన్నాడు. ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు. ఆయన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు. నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.


ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. ఫలితంగా మా కండ్లు మసకబారాయి.


చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు.


మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.


వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ