Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:20 - పవిత్ర బైబిల్

20 “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను! నాలో కలవరం చెలరేగింది! నా గుండె తలక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది! నా కలవరపాటుకు కారణం నేను మొండిగా తిరిగుబాటు చేయటమే! నా పిల్లలు నడివీధుల్లో కత్తికి గురి అయ్యారు. ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 యెహోవా, నన్ను తేరి చూడు. నాకు అమితమైన బాధ కలిగింది. నా కడుపు తిప్పుతోంది. నేను చేసిన దారుణమైన తిరుగుబాటు కారణంగా నా గుండె నాలో తలక్రిందులై పోతూ ఉంది. వీధుల్లో మా పిల్లలు కత్తివాత పడుతున్నారు. ఇంట్లో చావు ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:20
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను. శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.


అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను. మంచిని నేను చెడుగా మార్చాను. కానీ దేవుడు శిక్షించాల్సినంత కఠినంగా నన్ను శిక్షించలేదు.


నేలమీద పోయబడ్డ నీళ్లలా నా బలం పోయినది. నా ఎముకలు విడిపోయాయి. నా ధైర్యం పోయినది.


నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.


తన పాపాలు దాచిపెట్టడానికి ప్రయత్నించే మనిషి ఎన్నటికీ విజయం పొందడు. కాని ఒక మనిషి తాను తప్పులు చేశానని ఒప్పుకొని మరియు తన పాపాలు విడిచినట్లయితే దేవుడు మరియు ప్రతి ఒక్కరూ అతని యెడల దయ చూపిస్తారు.


అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం.


నేను గువ్వలా మూల్గాను. నేను పక్షిలా ఏడ్చాను. నా కళ్లు క్షీణించాయి కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను. నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి. నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”


నేను పల్లెపట్టులకు వెళితే, కత్తులతో సంహరింపబడినవారిని చూస్తాను. నేను నగరానికి వెళితే అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను. యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.’”


యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు. మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు. అవును. మేము నీ పట్ల పాపం చేశాము.


కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’ అని నీవు చెప్పుకుంటూ ఉంటావు. అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను, ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.


నీవు నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు నీ పాపం అదే. ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’” ఇదే యోహోవా వాక్కు.


దేవుడు ఇలా చెప్పుచున్నాడు: “ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను. అయినా నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” ఇది యెహోవా సందేశం.


అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను. నేను బాధతో క్రుంగి పోతున్నాను. అయ్యో, నేను భయ భ్రాంతుడనయ్యాను. నాలో నా గుండె దద్దరిల్లుతూ ఉంది. నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే నేను బూర ధ్వని విన్నాను. అది యుద్ధ నాదం. సైన్యాన్ని అది పిలుస్తోంది!


“మోయాబు కొరకు నేను మిక్కిలి ఖిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి.


యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు. ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు. ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు. ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు. యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు! ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.”


“నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను. అందువల్ల ఆయన చేసిన పని న్యాయమైనదే అని ఆమె అంటూ వుంది. కావున ప్రజలారా, వినండి! నా బాధను గమనించండి! నా యువతీ యువకులు బందీలైపోయారు.


యెరూషలేము ఘోరంగా పాపం చేసింది. యెరూషలేము పాపాల కారణంగా ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది. ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు. ఆమెను వారు నగ్నంగా చూశారు, గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు. యెరూషలేము మూల్గుతూ ఉంది. ఆమె వెనుదిరిగి పోతూవుంది.


యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.


కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి! నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది! నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది! నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూ ఉంది. పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో మూర్ఛపోతున్నారు.


మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.


శత్రువు కత్తిపట్టి నగరం వెలుపల కాచివున్నాడు. వ్యాధులు, క్షామము నగరం లోపల ఉన్నాయి. ఏ మనిషేగాని బయట తన పొలానికి వెళ్లితే వేచి వున్న శత్రు సైనికుడు అతన్ని చంపివేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నగరంలోనే వుంటే ఆకలి, వ్యాధులు అతన్ని చంపివేస్తాయి.


“ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం.


“ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చుకుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.


నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహీనమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున ఆ వినాశన దినం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీద దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది.


బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది; లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది. యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని, తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ