Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:13 - పవిత్ర బైబిల్

13 యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు ఆ అగ్ని నా ఎముకలకంటింది. ఆయన నా కాళ్లకు వలపన్నాడు. ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు. ఆయన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు. నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించియున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 పై నుంచి ఆయన నా ఎముకల్లోకి అగ్ని పంపించాడు. అది నా ఎముకలను కాల్చేసింది. ఆయన నా కాళ్ళకు వల పన్ని నన్ను వెనక్కి తిప్పాడు. ఆయన నిరంతరం నాకు ఆశ్రయం లేకుండా చేసి నన్ను బలహీనపరిచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 “ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 “ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:13
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి. అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.


కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు. ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు.


నా చర్మం చాలా నల్లబడిపోయింది. నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.


సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు.


ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. నా దారిలో వారు ఉచ్చు పెడతారు.


నేలమీద పోయబడ్డ నీళ్లలా నా బలం పోయినది. నా ఎముకలు విడిపోయాయి. నా ధైర్యం పోయినది.


నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది. నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి. నా బలం తొలగిపోతూ ఉంది.


కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము.


నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.


దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.


గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద కాల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి.


కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు. బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు. ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు. కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”


కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.


“నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము. నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు, అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము. పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి. నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”


యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.


ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. ఫలితంగా మా కండ్లు మసకబారాయి.


అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను (దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో చిక్కుకుంటాడు. నేనతనిని కల్దీయుల రాజ్యమైన బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. శత్రువు అతని కన్నులను పీకి గుడ్డివాణ్ణి చేస్తాడు అప్పుడు అక్కడ అతడు చనిపొతాడు.


నేను నావల పన్నుతాను. అతడందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులోనుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నా పై తిరుగుబాటు చేశాడు గనుక నేనతనిని శిక్షిస్తాను.


నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అనేక మంది ప్రజలను నేను ఒక దగ్గరికి చేర్చాను. నేనిప్పుడు నా వలను నీ మీదికి విసురుతాను. ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను లోపలికి లాగుతారు.


సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి, ఆకాశపక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక విషయంలో నేను వారిని శిక్షిస్తాను.


యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు. ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు. ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది. ఆయన రాకతో బండలు బద్దలై చెదిరిపోతాయి.


నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహీనమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున ఆ వినాశన దినం వచ్చేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీద దాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది.


“ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు.


దేవుడు అంటే ఎవరో తెలియనివాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించనివాళ్ళను ఆయన శిక్షిస్తాడు.


ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ