యెహోషువ 8:28 - పవిత్ర బైబిల్28 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికీ అది అలానే ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటివరకు అది అట్లే యున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 అలా యెహోషువ, హాయి ఎప్పటికీ పాడు దిబ్బగా ఉండాలని దాన్ని కాల్చివేశాడు, ఇప్పటికీ అది అలాగే ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 కాబట్టి యెహోషువ హాయిని కాల్చివేసి, దానిని శాశ్వత శిధిలాల కుప్పగా చేశాడు, ఇప్పటికీ అది నిర్జన ప్రదేశంగానే ఉంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 కాబట్టి యెహోషువ హాయిని కాల్చివేసి, దానిని శాశ్వత శిధిలాల కుప్పగా చేశాడు, ఇప్పటికీ అది నిర్జన ప్రదేశంగానే ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను ప్రజలు యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది. రబ్బోతు-అమ్మోను నాశనమవుతుంది. అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది. దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి. ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు. కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.” మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ఆ పట్టణంలో ఉన్న సమస్తం నాశనం చేయబడేందుకు అది యెహోవాకు అప్పగించబడాలి. కనుక ఆ వస్తువుల్లో ఏదీ మీకోసం మీరు ఉంచుకోకూడదు. మీరు ఈ ఆజ్ఞను పాటిస్తే, అప్పుడు యెహోవా మీ మీద కోపం చాలిస్తాడు. యెహోవా మీకు దయను ప్రసాదిస్తాడు. ఆయనకు మీమీద జాలి ఉంటుంది. ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ప్రకారం మీ రాజ్యాన్ని విస్తారంగా పెరుగనిస్తాడు.
హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని క్రింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.