Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 8:17 - పవిత్ర బైబిల్

17 హాయి, బేతేలు ప్రజలంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి యుండిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లనివారు హాయిలో గాని, బేతేలులో గాని ఒక్కరూ మిగల్లేదు. వారు ద్వారం మూయకుండానే పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్ళిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 ఇశ్రాయేలును తరమడానికి వెళ్లకుండా ఉన్నవారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరు కూడా లేదు. వారు పట్టణాన్ని మూయకుండా తెరిచే ఉంచి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 ఇశ్రాయేలును తరమడానికి వెళ్లకుండా ఉన్నవారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరు కూడా లేదు. వారు పట్టణాన్ని మూయకుండా తెరిచే ఉంచి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 8:17
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు. అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.


“కానీ హెష్బోను రాజైన సీహోను తన దేశంలోంచి మమ్మల్ని పోనివ్వలేదు. మీ దేవుడైన యెహోవా అతణ్ణి చాలా మొండికెత్తేటట్టు చేసాడు. సీహోను రాజును మీ అధికారంక్రింద ఉండటానికే యెహోవా ఇలా చేసాడు. ఇప్పుడు ఆయన దీనిని జరిగించాడు.


ఆ ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే యెహోవా కోరాడు. అప్పుడే వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమిచేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన వారిని నాశనం చేయబడనిచ్చాడు.


పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు.


యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు.


కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు.


బెన్యామీను సైన్యం గిబియా నగరం వెలుపలికి వచ్చింది, ఇశ్రాయేలు సైనికుల్ని ఎదుర్కొనడానికి. ఇశ్రాయేలు సైన్యం వెనుకకు మరలింది. బెన్యామీను సైన్యం తమను తరుముకు రావాలని అలా చేసింది. ఈ విధంగా బెన్యామీను సైన్యం నగరానికి చాలా దూరంలో ఉండాలని మాయోపాయం పన్నబడింది. బెన్యామీను సైన్యం, తాము పూర్వం చేసినట్లుగా, ఇశ్రాయేలు సైనికుల్ని చంపడం మొదలు పెట్టింది. ఇశ్రాయేలుకి చెందిన సుమారు ముఫ్పై మందిని చంపివేయడం జరిగింది. పొలాలలో ఉండేవారిని కొందరిని చంపివేశారు. రాజమార్గం మీద ఉన్న వారిని కొందరిని చంపివేశారు. ఒక రాజమార్గం బేతేలు నగరానికి వెళుతుంది. మరొక రాజమార్గం గిబియా నగరానికి వెళుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ