యెహోషువ 7:21 - పవిత్ర బైబిల్21 యెరికో పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబులోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభైతులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ క్రిందనే ఉంది.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది” అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను వస్త్రం, రెండువందల షెకెళ్ళ వెండి, యాభై షెకెళ్ళ బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను వస్త్రం, రెండువందల షెకెళ్ళ వెండి, యాభై షెకెళ్ళ బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။ |
ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు. ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు. అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బ్రతకనిస్తాను.”
శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; త్రాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలను వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటికి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు.
“మీరు వారి దేవుళ్ల విగ్రహాలను తప్పక కాల్చి వేయాలి. ఆ విగ్రహాల మీద ఉండే బంగారంకానీ వెండి గానీ మీరు తీసుకొంటే బాగుంటుందని మీరు ఆశించ కూడదు. ఆ వెండిగాని, బంగారంగాని మీకోసం మీరు తీసుకోకూడదు. మీరు అలా చేస్తే, మీరు చిక్కులో పెట్టబడతారు. (మీ జీవితాలు నాశనం అవుతాయి) ఎందుకంటే మీ యెహోవా దేవునికి ఆ విగ్రహాలు అసహ్యం.