Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 21:11 - పవిత్ర బైబిల్

11 కిర్యత్ అర్బ (హెబ్రోను), దాని పొలాలు అన్నీ వారు వారికి ఇచ్చారు. ఇది యూదా కొండ దేశంలో ఉంది. (అనాకు తండ్రి అర్బ). ఆ పట్టణం దగ్గర్లో వారి పశువులు మేసేందుకు పొలాలు కూడ వారికి లభించాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 యూదా కొండసీమలో వారికి కిర్యతర్బా, అంటే హెబ్రోను (అర్బా అనాకు తండ్రి) దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు ఇచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 21:11
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

కనాను దేశంలోని కిర్యతర్బా (అనగా హెబ్రోను) పట్టణంలో ఆమె మరణించింది. అబ్రాహాము చాలా దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు.


కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది.


నాలుగేండ్ల తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి.


వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు ప్రక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది.


మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది.


గతంలో ఆ పట్టణం కిర్యత్ అర్బ అని పిలువబడింది. అనాకీ ప్రజల్లోకెల్లా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది.


హుమతా, కిర్యత్ అర్బ (హెబ్రోను అని కూడ పిలువబడింది) మరియు సీయోరు. 9 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి.


మొదట నిర్ణయించబడిన పట్టణాలు కహత్ కుటుంబానికి ఇవ్వబడ్డాయి (లేవీ ప్రజలు).


అయితే కిర్యత్ అర్బ చుట్టు ఉన్న చిన్న పట్టణాలు, పొలాలు యెపున్నె కుమారుడైన కాలేబుకు చెందినవి.


తర్వాత హెబ్రోను పట్టణంలో నివసించిన కనానీయులతో యుద్ధం చేసేందుకు యూదావారు వెళ్లారు. (హెబ్రోను కిర్యతర్బా అని పిలువబడేది.) షేషయి, అహీమాను, తల్మయి అనే వారిని యూదావారు ఓడించారు.


మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ