Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 10:23 - పవిత్ర బైబిల్

23 కనుక యెహోషువ మనుష్యులు ఆ అయిదుగురు రాజులను గుహలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు రాజులు యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 10:23
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారి రాజులను ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని అడ్డగించటం ఏ మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ నాశనం చేస్తారు.


అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు.


యెహోషువ ఇలా చెప్పాడు, “గుహను మూసిన బండలను తీసివేసి, ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకొని రండి” అని.


యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు.


అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులు వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియు వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.


యెరూషలేము రాజు. హెబ్రోను రాజు.


ఎగ్లోను రాజు. గెజెరు రాజు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ