Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోవేలు 2:30 - పవిత్ర బైబిల్

30 ఆకాశంలోను, భూమిమీదను ఆశ్చర్యకార్యాలు నేను చూపిస్తాను. రక్తం, అగ్ని, దట్టమైన పొగ ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 నేను ఆకాశంలో అద్భుతాలను, భూమి మీద రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 నేను ఆకాశంలో అద్భుతాలను, భూమి మీద రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోవేలు 2:30
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు క్రిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.


పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల సువాసనలతో పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.


అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు. ఆకాశం చీకటవుతుంది. నా మాటకు తిరుగులేదు. నేనొక నిర్ణయాని కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.”


అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది.


“ఆ కష్టకాలం గడిచిన వెంటనే, ‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు. చంద్రుడు వెలుగునివ్వడు నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’


అన్నిచోట్లా తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి.


హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షీణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తరమటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది.


ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు.


“దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు.


మొదటి దేవదూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న మూడవ భాగం కాలిపోయింది. మూడవ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చగడ్డి పూర్తిగా కాలిపోయింది.


ఇశ్రాయేలు మనుష్యులు దాగివున్న మనుష్యుల ద్వారా ఒక యుక్తిపన్నారు. దాగివున్న మనుష్యులు ఒక ప్రత్యేక సూచన పంపాలి. ఒక పెద్ద పొగమేఘం వారు కల్పించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ