యోవేలు 2:21 - పవిత్ర బైబిల్21 దేశమా, భయపడకు. సంతోషించి ఆనందంతోనిండి ఉండు. ఎందుకంటే యెహోవా గొప్పకార్యాలు చేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. యెహోవా గొప్ప పనులు చేశాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 యూదా దేశమా, భయపడకు; సంతోషించు, ఆనందించు. నిజంగా యెహోవా గొప్పకార్యాలు చేశారు! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 యూదా దేశమా, భయపడకు; సంతోషించు, ఆనందించు. నిజంగా యెహోవా గొప్పకార్యాలు చేశారు! အခန်းကိုကြည့်ပါ။ |
లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు. మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు. కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”
“ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు.