Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోవేలు 2:2 - పవిత్ర బైబిల్

2 అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది. అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు. అది మహాశక్తిగల సైన్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు. మరియు ఇలాంటిది ఏదీ, ఎన్నటికీ మరోసారి ఉండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోవేలు 2:2
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు. “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.


దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి. నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.


మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు.


మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.’” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.


దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు.


కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.


వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.


మీ యెహోవా దేవుని గౌరవించండి. ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు. మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనకు స్తోత్రం చేయండి. యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు. కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు. యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.


చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.


త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష్యపెట్టినట్లు లేదు. కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి. నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా? నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా? యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా? ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.


నిన్ను మాయం చేస్తాను. నేను ఆకాశాన్ని కప్పివేసి నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను. ఒక మేఘంతో నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు ప్రకాశించడు.


తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను.


కాని నీవు వారిని ఎదిరించటానికి వస్తావు. నీవొక తుఫానులా వస్తావు. దేశాన్ని ఆవరించి గర్జించే మేఘంలా నీవు వస్తావు. నీవు, నీతో వున్న అన్య దేశాల సైనిక దళాలు ఈ ప్రజల మీదికి వచ్చి పడతారు.’”


“ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారికి కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు.


“దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా యెడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహా విపత్తును యెరూషలేము యెడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు.


నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒక పెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యం కానంతమంది సైనికులు ఉన్నారు. ఆ మిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంటుంది.


“నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను. ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు మరియు ఆ కోత మిడుతలు మీ పంటను తినివేశాయి. కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ తిరిగి మీకు నేను చెల్లిస్తాను.


సూర్యుడు చీకటిగా మార్చబడతాడు. చంద్రుడు రక్తంగా మార్చబడతాడు. అప్పుడు యెహోవాయొక్క మహా భయంకర దినం వస్తుంది!


వారి మాట వినండి. అది పర్వతాలమీద రథాలు పరుగులెత్తిన ధ్వనిలా ఉంది. అది పొట్టును కాల్చివేస్తోన్న అగ్నిజ్వాలల శబ్దంలా ఉంది. వారు శక్తిగల ఒక జనం. వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.


“తూరూ! సీదోనూ! ఫిలిష్తీయలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.


నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే. మీ మనస్సులను సృష్టించింది నేనే. ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే. సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను. ఇట్టి నేను ఎవరిని? సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.


నా ప్రభువైన యెహోవాముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే, ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిథులతో సిద్ధంగా ఉండమని చెప్పాడు.


అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది.


ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.


ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు.


“పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి, అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి. మీ తండ్రిని అడగండి, ఆయన చెబుతాడు; మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.


తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు.


అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటివాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటివాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు.


అతడు పాతాళాన్ని తెరిచాడు. అప్పుడు దాన్నుండి పెద్ద పొగ లేచింది. అది ఒక పెద్ద కొలిమి నుండి వచ్చినట్లు అనిపించింది. పాతాళం నుండి వచ్చిన పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకటైపోయాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ