Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 15:6 - పవిత్ర బైబిల్

6 నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

6 మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 15:6
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాటిని ఎవరు తాకినా కర్ర, ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది. దుష్టులు కూడ ముండ్ల వంటి వారు వారు అగ్నిలో తోయబడి పూర్తిగా దహింపబడతారు.”


దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. అగ్నిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.


దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము. నీవు పెంచిన ఆ లేత మొక్కలను చూడుము.


అయితే నీవు, దుష్ట రాజువి నీ సమాధిలోనుండి త్రోసి వేయబడ్డావు. నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది. నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు. మిగతా సైనికులు వాని మీద నడిచారు. ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు. నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు.


ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి.


నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా? లేదు! ఆ క్రొత్త గ్రద్ద మొక్కను భూమినుండి పెరికివేస్తుంది. మొక్క వేళ్లను గ్రద్ద నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది. క్రొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి. మొక్క చాలా బలహీనమవుతుంది. మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు.


వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు.


యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.


చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు.


దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు.


నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటికొనల్ని కత్తిరిస్తాడు.


తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి.


ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకొని బానిసలైతే యిప్పటి స్థితి మునుపటి స్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.


క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.


జీవగ్రంథంలో పేరులేనివాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు.


కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ