Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 8:19 - పవిత్ర బైబిల్

19 నా ప్రజల మొరాలకించుము! దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు. “సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా? సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు. కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు? వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము వినబడుచున్నది; వారి విగ్రహములచేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి. వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 సుదూరదేశం నుండి నా ప్రజల మొరను ఆలకించు: “యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో ఎందుకు నాకు కోపం రప్పించారు?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 సుదూరదేశం నుండి నా ప్రజల మొరను ఆలకించు: “యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో ఎందుకు నాకు కోపం రప్పించారు?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 8:19
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి!


బబులోను నదుల దగ్గర మనం కూర్చొని సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.


యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. యెహోవాను స్తుతించండి!


ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి. సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.


వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.


ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుణ్ణి) ఆ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.


సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు. అందుచేత, సంతోషంగా ఉండండి!


ఈ సైన్యం, యెహోవా, చాలా దూరదేశంనుండి వస్తున్నారు. ఆకాశపు అంచుల ఆవలినుండి వారు వస్తున్నారు. యెహోవా తన కోపం ప్రదర్శించటానికి ఈ సైన్యాన్ని ఒక ఆయుధంలా వాడుకొంటాడు. ఈ సైన్యం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది.”


ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ మనుష్యులు ఏమన్నారు? వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అతన్ని అడిగాడు. “ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబులోను నుండి వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు.


మేలుకో! మేలుకో! సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు. నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో! దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు, పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు.


ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి. అవి హాస్యాస్పదమైనవి. తీర్పు తీర్చే కాలంలో ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.


యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.


ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు. ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు. అయినా నీవు మాతో ఉన్నావు. యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నాము. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”


యెహోవా ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా? అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు? మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.


కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడిచేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు.


కావలి వారు ఈ వర్తమానాన్ని చాటే సమయం వస్తుంది: ‘రండి మనమంతా సీయోనుకు వెళ్లి మన దేవుడైన యెహోవాను ఆరాధించుదాము!’ కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడ కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!”


ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు.


కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమానపర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,


మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు: “పంటకోత కాలం అయిపోయింది. వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”


యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను. వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది. వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు. కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను. యూదా ప్రజలను వారు చంపివేస్తారు. ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”


“నగరం చుట్టుకొలత ఆరుమైళ్లు. ఇప్పటి నుండి ఈ నగరం యెహోవా ఇక్కడ ఉన్నాడు అని పిలువబడుతుంది.”


అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ వ్యక్తి అయినా సరే రక్షింపబడతాడు. సీయోను కొండమీద యెరూషలేములో రక్షింపబడిన మనుష్యులు ఉంటారు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరుగుతుంది. మిగిలిన వారిలో యెహోవా పిలిచినవారు ఉంటారు.


ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు. కనుక ఆ ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!” యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు.


కాని సీయోను కొండమీద మాత్రం మిగిలినవారు ఉంటారు. వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు. యాకోబు వంశం తనకు చెందిన వస్తువులను తిరిగి తీసుకొంటుంది.


నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు? నీ రాజు వెళ్లిపోయాడా? నీ నాయకుని నీవు కోల్పోయావా? ప్రసవవేదనపడే స్త్రీలా నీవు బాధ పడుతున్నావు.


ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు.


మరియు నేనా ప్రజలను బాధిస్తాను. వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు. బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు. కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను. వారు నా ప్రజలకు బానిసలవుతారు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవాయే నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు.


“అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికిరానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు.


ఆ సమయంలో నేను వారిమీద చాలా కోపగించి, వాళ్లను విడిచి పెడ్తాను. వాళ్లకు సహాయం చేయటానికి నేను ఒప్పుకోను, వాళ్లు నాశనం చేయబడతారు. వాళ్లకు భయంకరమైన సంగతులు జరుగుతాయి, వాళ్లకు కష్టాలు వస్తాయి. అప్పుడు ‘మన దేవుడు మనతో లేడు గనుక ఈ కీడులు మనకు కలిగాయి’ అని వారు అంటారు.


“ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ విధంగా అంటున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ