యిర్మీయా 8:13 - పవిత్ర బైబిల్13 “‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు. వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి. నేను వారికిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ద్రాక్షచెట్టున ఫలములులేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లులేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను. ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు. అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు, వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చింది వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు. అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు, వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చింది వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ” အခန်းကိုကြည့်ပါ။ |
యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”
మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు. మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం చేస్తారు. వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు. మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు. కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు. మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”