Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 6:22 - పవిత్ర బైబిల్

22 యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది. భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంతములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది. ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, ఉత్తర దేశం నుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, ఉత్తర దేశం నుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 6:22
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించినట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.


ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది. అది యూదా నగరాలను నాశనం చేస్తుంది. యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.


యెరూషలేమా, పైకి చూడు! ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు. నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది.


సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: “ఒక దేశాన్నుండి మరొక దేశానికి విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి. అవి పెనుతుఫానులా భూమిపై సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”


అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు.


యెహోవా చెప్పినది ఇలా ఉంది: “భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం! ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!


“దానిని ఈ దేశమంతా ప్రకటించండి. ఆ వార్తను యెరూషలేము నగరవాసులకు తెలియజేయండి. బహుదూరపు దేశంనుండి శత్రువు వస్తున్నాడు. యూదా నగరాలపై శత్రువులు యుద్ధ ధ్వని చేస్తున్నారు.


సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము. మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు! ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి నేను విపత్తును తీసుకొని వస్తున్నాను. నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.”


యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.


ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు: “మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను. అది ఒక ప్రాచీన రాజ్యం అది ఒక శక్తివంతమైన రాజ్యం. మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు. వారు చెప్పేది మీకు అర్థం కాదు.


వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి. వారంతా యోధాన యోధులు.


బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!


నీ మీద నా కోపాన్ని క్రుమ్మరిస్తాను. వేడి గాడ్పువలె నా కోపం నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను దుష్టులయిన మగవారికి అప్పగిస్తాను. వారు ప్రజల్ని హత మార్చటంలో ఆరితేరిన వారు.


కావున ఒహొలీబా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘నీ ప్రేమికులతో నీవిప్పుడు విసుగుచెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు.


బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చెందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు.


“దూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి అవతలి పక్కనుండి వస్తుంది. ఈ రాజ్య భాష మీకు అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ