యిర్మీయా 52:1 - పవిత్ర బైబిల్1 యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరాల వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా. హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువదియొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా కూతురు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు. အခန်းကိုကြည့်ပါ။ |
సిద్కియా తిరుగుబాటు చేసి, బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు. అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. ఆ తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు.
అష్షూరు రాజుకు సమాచారం అందింది. “ఇథియోపియా రాజు తిర్హాకా నీతో యుద్ధం చేయటానికి వస్తున్నాడు” అని ఆ సమాచారం తెలియజేసింది. కనుక అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నాకు వెళ్లాడు. సైన్యాధికారి ఇది విని, అష్షూరు రాజు యుద్ధం చేస్తున్న లిబ్నా పట్టణం వెళ్లాడు. అప్పుడు సైన్యాధికారి హిజ్కియా దగ్గరకు సందేశకులను పంపించాడు. సైన్యాధికారి చెప్పాడు.
యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు.