యిర్మీయా 51:6 - పవిత్ర బైబిల్6 బబులోను నుంచి పారిపొండి. మీ ప్రాణ రక్షణకై పారిపొండి! మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు! వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది. బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 బబులోనులో నుండి పారిపోండి. ప్రతి ఒక్కడూ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. దాని పాపానికి పడే శిక్షలో మీరు నాశనం కావద్దు. ఇది యెహోవా ప్రతీకారం చేసే కాలం. ఆమెకు తన పనులను బట్టి ఆయన తిరిగి చెల్లిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
“కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు! ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు. యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు, బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నాడని వారు చెబుతున్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.
మీ బాణాలకు పదును పెట్టండి. మీ డాళ్లను చేపట్టండి! యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు. ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు. కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు. బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు. బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది. కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.