Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:56 - పవిత్ర బైబిల్

56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది. బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి. ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు. వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

56 బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారముచేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

56 ఆమెకు వ్యతిరేకంగా, బబులోనుకు వ్యతిరేకంగా వినాశకులు వచ్చేశారు. ఆమె యోధులను పట్టుకున్నారు. వాళ్ళ ధనుస్సులను విరగ్గొట్టేశారు. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

56 బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

56 బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:56
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను అతడు పోరాటం గెల్చాడు. తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి గొర్రెల కాపరినుండి, ఇశ్రాయేలు బండనుండి


బబులోనూ, నీవు నాశనం చేయబడతావు! నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!


కాని వారి విల్లులు విరిగిపోతాయి. వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.


భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.


అక్కడ విల్లులను, బాణాలను కేడెములను, కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.


జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను. దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను. ప్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను. ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి. మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు. ఆ పట్టణంలో చెడు సంగతులన్నింటినీ నేను అంతం చేస్తాను.


శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు.


ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు.


యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు. యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు. కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.


సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను. విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.


కల్దీయుల భాగ్యాన్నంతా శత్రువు కొల్లగొడతాడు. శత్రు సైనికులు తాము కోరుకున్నవన్నీ పొందగలుగుతారు.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.


బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక, ఆ యాజకులు ఒట్టి మూర్ఖులవుతారు. బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక. ఆ సైనికులు భీతావహులవుతారు.


కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను. యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి తగిన శాస్తి చేస్తాను.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.


బబులోను సైనికులు పోరాడటం మానివేశారు. వారు తమ కోటల్లోనే ఉండిపోయారు. వారి శక్తి తరిగిపోయింది. వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు. బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి. దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.


అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు. శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి గనుక వారునూ కేకలు పెడతారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.


ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు. బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను. ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.


బబులోను నుంచి పారిపొండి. మీ ప్రాణ రక్షణకై పారిపొండి! మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు! వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది. బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది.


ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!


కాని నీ ఎడమచేతి నుండి నీ ధనుస్సును నేల రాల్చుతాను. నీకుడి చేతి నుండి నీ బాణాలు పడిపోయేలా చేస్తాను.


“ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసిస్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రువుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధనుస్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు.


విల్లంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకరు. వేగంగా పరుగిడగలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణాలతో తప్పించుకోలేరు.


అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది. నీవు ఇతర ప్రజలకు కీడు చేశావు. అదే కీడు నీకూ జరుగుతుంది. అవే చెడ్డపనులు నీ తలమీదికి వచ్చి పడతాయి.


నీవు అనేక దేశాలనుండి వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి చాలా తీసుకుంటారు. నీవు అనేకమందిని చంపివేశావు. నీవు దేశాలను, నగరాలను నాశనం చేశావు. నీవక్కడ ప్రజలందరినీ చంపివేశావు.


ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే; ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’


దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు.


నీవు చూసిన మృగము, దాని పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి.


పరలోకమా! దాని పతనానికి ఆనందించు! విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి. అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’” అని అంటారు.


ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు. తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన ఆ వేశ్యను ఆయన శిక్షించాడు. తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”


మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి! బలహీనులు బలవంతులవుతారు!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ