మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది. ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు. దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు. ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు. ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.
శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర శత్రువులు సవాళ్లు విసరుతారు. అయితే దేవా, నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో వేడి భూమిని నిస్సారం చేస్తుంది. అదే విధంగా నీవు శత్రువులకంటె బలం ఉన్నవాడివి దట్టమైన మేఘాలు వేసవి వేడిని ఆపుజేస్తాయి. అదే విధంగా, భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు.
బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువకులు) చంపండి. వారినినరకబడనివ్వండి. వారు ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి కష్టం వచ్చిపడింది. వారు శిక్షింపబడే సమయంవచ్చింది.
ఆ సైన్యాల గురించి బబులోను రాజు విన్నాడు. అతడు బాగా బెదరిపోయాడు! అతని చేతులు బిగుసుకుపోయేటంతగా అతడు భయపడ్డాడు. ప్రసవ స్త్రీ వేదనవలె, అతని భయం అతని కడుపును ఆరాటపెడుతుంది.”
యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ఆ సమయంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర చోట్ల ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా కొండల్లో నాశనం చేయబడుతున్నవాటి పెద్ద శబ్దాలను ప్రజలు వింటారు.