Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:48 - పవిత్ర బైబిల్

48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు. శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి గనుక వారునూ కేకలు పెడతారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

48 దానిని పాడుచేయువారు ఉత్తరదిక్కునుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతినిగూర్చి సంతోషించును ఇదే యెహోవా వాక్కు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

48 వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

48 అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

48 అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:48
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు.


యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి. భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది. పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి. అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక. ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.


నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి. నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి. ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి. భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!


భూమి, ఆకాశములారా సంతోషించండి. పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి. ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక. తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు.


ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది. ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది. ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు. మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”


“చూడండి! ఉత్తరాన్నుండి జనులు వస్తున్నారు. వారొక బలమైన రాజ్యం నుండి వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి చాలామంది రాజులు కలిసి వస్తున్నారు.


ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను. ఈ దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది. ఆ రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి. యుద్ధం నుండి వట్టి చేతులతో తిరిగిరాని సైనికుల్లా ఈ బాణాలు వుంటాయి.


సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది. బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి. ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు. వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.


నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు ఈ భూమి యావత్తూ సంతోషిస్తుంది.


పరలోకమా! దాని పతనానికి ఆనందించు! విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి. అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’” అని అంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ