యిర్మీయా 51:46 - పవిత్ర బైబిల్46 “నా ప్రజలారా, విచారించకండి. వదంతులు వ్యాపిస్తాయి; కాని భయపడవద్దు. ఒక వదంతి ఈ సంవత్సరం వ్యాపిస్తుంది. మరొక వదంతి మరు సంవత్సరం వస్తుంది. దేశంలో భీకరపోరాటం గురించిన వదంతులు లేస్తాయి. పాలకులు ఇతర పాలకులతో పోట్లాడుతున్నట్లు వదంతులు వస్తాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 దేశంలో వినిపించే వార్తలకు మీ హృదయాలను భయపడనివ్వకండి. ఈ వార్తలు ఈ సంవత్సరం వినిపిస్తాయి. ఇది అయ్యాక తర్వాత సంవత్సరం మళ్ళీ వార్తలు వినిపిస్తాయి. దేశంలో హింస జరుగుతుంది. ఒక రాజ్యాధిపతికి విరోధంగా మరో రాజ్యాధిపతి ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 దేశంలో పుకార్లు వినబడినప్పుడు, ధైర్యం కోల్పోవద్దు, భయపడవద్దు; ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఇంకొక పుకారు వస్తూనే ఉంటుంది, దేశంలో హింస జరుగుతుందని, పాలకునికి వ్యతిరేకంగా మరో పాలకుడు ఉన్నాడని పుకార్లు వినబడతాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 దేశంలో పుకార్లు వినబడినప్పుడు, ధైర్యం కోల్పోవద్దు, భయపడవద్దు; ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఇంకొక పుకారు వస్తూనే ఉంటుంది, దేశంలో హింస జరుగుతుందని, పాలకునికి వ్యతిరేకంగా మరో పాలకుడు ఉన్నాడని పుకార్లు వినబడతాయి. အခန်းကိုကြည့်ပါ။ |
యెహోవా ఇలా అంటున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, భయపడకు. నేను నీతో వున్నాను. నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్‌షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు.