Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:45 - పవిత్ర బైబిల్

45 నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయటకు రండి. మీ ప్రాణరక్షణకు పారిపొండి. యెహోవా యొక్క భయానక కోపంనుండి దూరంగా పారిపొండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

45 నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

45 నా ప్రజలారా! మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి. మీలో ప్రతి ఒక్కడూ నా క్రోధం నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

45 “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

45 “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:45
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి. నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి. ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి. భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!


బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు, బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నాడని వారు చెబుతున్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.


“బబులోను నుండి పారిపొండి. కల్దీయుల రాజ్యాన్ని వదిలిపొండి. మందముందు నడిచే మేకలు మాదిరి వుండండి.


కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి; బబులోనును వదిలిపొండి. ఆగకండి! మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు. కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసుకొనండి.


బబులోను నుంచి పారిపొండి. మీ ప్రాణ రక్షణకై పారిపొండి! మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు! వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది. బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది.


బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము. కాని ఆమె స్వస్థతనొందలేదు. కావున ఆమెను వదిలివేసి మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం. వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు. బబులోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.


సీయోను ప్రజలారా! మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరంనుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నాయి.


మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.”


వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.”


“కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి. అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను అని ప్రభువు అన్నాడు.”


ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను: “నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి. ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు. అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ