Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:33 - పవిత్ర బైబిల్

33 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను నగరం పంటకళ్లంలా ఉన్నది. పంటకోయు కాలంలో రైతులు కోసిన పైరును కొట్టి పొట్టునుండి ధాన్యాన్ని వేరుచేస్తారు. బబులోనును కొట్టే కాలం దగ్గర పడుతోంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–బబు లోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలమువచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది. ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:33
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందమైన ఒక వేసవి రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు.


యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”


“కల్దీయుల కుమారీ, కన్యకా మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో. ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు. ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని, అందగత్తె అని పిలువరు.


మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టుబడ్డాయి. చిత్తడి నేలలు సహితం మండుతున్నాయి. బబులోను సైనికులంతా భయపడ్డారు.”


యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది. బానిసత్వంనుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”


పంట సిద్ధంగా ఉంది గనుక కొడవలి పట్టుకొని రండి. రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక ద్రాక్షాపండ్లమీద నడవండి. వారి దుర్మార్గం చాలాఉంది గనుక పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి.


యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “దమస్కు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు గిలాదును ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు.


ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు. కాని యెహోవా చేసే యోచన మాత్రం వారు ఎరుగరు. యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు. కళ్లంలో ధాన్యం నూర్చబడినట్లు ఆ జనులు నలగదొక్కబడతారు.


“సీయోను కుమారీ, లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు. నేను నిన్ను బాగా బలపర్చుతాను. నీకు ఇనుప కొమ్ములు, కంచు గిట్టలు ఉన్నట్లవుతుంది. అనేకమంది జనులను నీవు ముక్కలుగా చితకగొడతావు. వారి సంపదను నేను యెహోవాకు ఇస్తాను. వారి భాగ్యాన్ని సర్వజగత్తుకూ అధిపతియైన యెహోవాకు సమర్పిస్తాను.”


నీవు కోపంతో భూమిపై నడిచి దేశాలను శిక్షించావు.


కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”


వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ