యిర్మీయా 51:10 - పవిత్ర బైబిల్10 యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు. రండి! ఈ విషయం మనం సీయోనులో చెప్పుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను గూర్చి చెప్పుదాం. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 యెహోవా మన న్యాయమును రుజువుపరచు చున్నాడు రండి సీయోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యెహోవా మన నిర్దోషిత్వాన్ని ప్రకటించాడు. రండి మనం సీయోనులో దీన్ని చెపుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను వివరిద్దాం. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 “ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; రండి, మన దేవుడైన యెహోవా ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’ အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 “ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; రండి, మన దేవుడైన యెహోవా ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’ အခန်းကိုကြည့်ပါ။ |
బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు, బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నాడని వారు చెబుతున్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.
బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా పన్నిన పధకాన్ని వినండి. కల్దీయులకు వ్యతిరేకంగా యెహోవా ఏమి చేయ నిర్ణయించాడో వినండి. “శత్రువు బబులోనులోని గొర్రె పిల్లలను (ప్రజలను) తిరిగి తీసికొంటాడు. ఆ గొర్రె పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు. ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు. జరిగిన దానికి బబులోను విస్మయం చెందుతుంది.