Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 50:38 - పవిత్ర బైబిల్

38 బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక. ఆ నీటి వనరులన్నీ ఎండిపోతాయి. బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు. బబులోను ప్రజలు మూర్ఖులని ఆ విగ్రహాలు చాటి చెపుతున్నాయి. అందుచే ఆ ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 ఒక కత్తి ఆమె నీళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. ఊటలు ఇంకి పోయి నీటిఎద్దడి ఏర్పడుతుంది. ఎందుకంటే అది పనికిమాలిన విగ్రహాలున్న దేశం. ఈ భయంకరమైన విగ్రహాలను బట్టి ప్రజలు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 దానికి నీళ్ల కరువు వస్తుంది! నీళ్లు ఎండిపోతాయి. అది విగ్రహాల దేశం, భయంకరమైన విగ్రహాల వల్ల ప్రజలు పిచ్చివారవుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 దానికి నీళ్ల కరువు వస్తుంది! నీళ్లు ఎండిపోతాయి. అది విగ్రహాల దేశం, భయంకరమైన విగ్రహాల వల్ల ప్రజలు పిచ్చివారవుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 50:38
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్లు దేవుడు చేశాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి.


అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబుతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు.


“ఎండిపొండి! మీ కాలువలను నేను ఎండిపోయేట్టు చేస్తాను” అని లోత్తెన జలాలతో యెహోవా చెబుతున్నాడు.


ఇప్పుడు నీ తల్లికి తలవంపులవుతుంది. నినుగన్న తల్లి కలత చెందుతుంది. దేశాలన్నిటిలో బబులోను అతి సామాన్యమైపోతుంది. ఆమె బెట్టయైన వట్టి ఎడారిలా అవుతుంది.


“అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి! జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి! పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి, ‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది. బేలు దైవం అవమానపర్చబడుతుంది. మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది. బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి. దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’


బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను. తను మింగిన మనుష్యులను అతడు కక్కేలా చేస్తాను. ఇతర రాజ్యాల వారు బబులోనుకు రారు. బబులోను నగరపు చుట్టున్న ప్రాకారం కూలిపోతుంది.


బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది. బబులోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడుతుంది. అనేకమంది ప్రజలు చనిపోయి నగర వీధుల్లో పడివుంటారు.


యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను నేను శిక్షించే సమయం వస్తోంది. ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు.


యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది. బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది. బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి. కావున వారికి వెర్రి పట్టింది.


త్రాగుచూ వారు బంగారం, వెండి, కంచు, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.


పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది.


ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది.


ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది: మర్మము, మహా బాబిలోను వేశ్యలకు తల్లి! ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!


కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ