Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 50:37 - పవిత్ర బైబిల్

37 బబులోను గుర్రాలను, రథాలను ఒక కత్తి నరికి వేయుగాక. విదేశ కిరాయి సైనికులను ఒక కత్తి సంహరించుగాక, ఆ సైనికులందరూ భయపడిన స్త్రీలవలె ఉంటారు. బబులోను ధనాగారాల మీదికి ఒక కత్తి వెళ్లుగాక. ఆ ధనాగారాలు దోచుకోబడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 వాళ్ళ గుర్రాలకూ, రథాలకూ, బబులోనులో ఉన్న వాళ్ళందరికీ విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. అందుచేత వాళ్ళు స్త్రీల వలే బలహీనులౌతారు. ఆమె గిడ్డంగులకు విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. వాటిని దోచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 దాని గుర్రాలు రథాల మీదికి దానిలో ఉన్న విదేశీయులందరి మీదికి ఖడ్గం వస్తుంది! వారు స్త్రీలలా బలహీనులవుతారు. ఆమె సంపద మీదికి ఖడ్గం వస్తుంది! దాన్ని దోచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 దాని గుర్రాలు రథాల మీదికి దానిలో ఉన్న విదేశీయులందరి మీదికి ఖడ్గం వస్తుంది! వారు స్త్రీలలా బలహీనులవుతారు. ఆమె సంపద మీదికి ఖడ్గం వస్తుంది! దాన్ని దోచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 50:37
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.


యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు. రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.


ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు.


చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను. దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను. నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేందుకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలీయుల దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.


అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను. ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజా, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.


అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు.


మోయాబు పట్టణాలు పట్టుబడతాయి. బలమైన దుర్గాలు ఓడింపబడతాయి. ఆ సమయంలో మోయాబు సైనికులు ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.


కల్దీయుల భాగ్యాన్నంతా శత్రువు కొల్లగొడతాడు. శత్రు సైనికులు తాము కోరుకున్నవన్నీ పొందగలుగుతారు.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.


“దూర తీరాల నుండి బబులోను మీదికి రండి. ఆమె ధాన్యాగారాలను పగులగొట్టండి. బబులోనును సర్వనాశనం చేయండి. సజీవంగా ఎవ్వరినీ వదల వద్దు. పెద్ద ధాన్యరాసులవలె వారి శవాలను గుట్టవేయండి.


గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను. రథాన్ని, సారథిని చిదుకగొట్టటానికి నిన్నుపయోగించాను.


స్త్రీ పురుషులను చితుకగొట్టుటకు నిన్ను వాడాను. వృద్ధులను, యువకులను చితకగొట్టుటకు నిన్ను వాడాను. యువకులను, యువతులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.


బబులోను సైనికులు పోరాడటం మానివేశారు. వారు తమ కోటల్లోనే ఉండిపోయారు. వారి శక్తి తరిగిపోయింది. వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు. బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి. దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.


బబులోను సైనికులు కల్దీయుల రాజ్యంలో చంపబడతారు. బబులోను వీధుల్లో వారు తీవ్రంగా గాయపర్చబడతారు.”


“‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు!


నా బల్లవద్ద తినటానికి మీకు మాంసం పుష్కలంగా లభిస్తుంది. వారిలో గుర్రాలు, రథసారధులు బలిష్ఠులైన సైనికులు, ఇతర పోరాట యోధులు ఉన్నారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.


సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “నీనెవే, నేను నీకు వ్యతిరేకిని! నీ రథాలను నేను తగులబెడతాను. యుద్ధంలో నీ ‘యువ సింహాలను’ నేను చంపుతాను. భూమి మీద మరెన్నడూ నీవు ఎవరినీ వెంటాడవు. నీ దూతలు చెప్పేవాటిని ప్రజలు మరెన్నడూ వినరు.”


నీనెవే, నీ ప్రజలంతా స్త్రీలవలె ఉన్నారు. శత్రు సైనికులు వారిని పట్టుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీ శత్రువులు లోనికి రావటానికి అనువుగా నీ దేశపు ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ద్వారాలకు అడ్డంగా వున్న కర్రపట్టీలను అగ్ని కాల్చివేసింది.


రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఆ ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను, వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. ఆ సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరికొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకొంటారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ