యిర్మీయా 50:34 - పవిత్ర బైబిల్34 కాని, దేవుడు ఆ ప్రజలను తిరిగి తీసికొని వస్తాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా. ఆ ప్రజలను ఆయన బాగా రక్షిస్తాడు. వారి రాజ్యానికి విశ్రాంతి కల్గించే విధంగా ఆయన వారిని రక్షిస్తాడు. అంతేగాని బబులోనులో నివసించే వారికి ఆయన విశ్రాంతినివ్వడు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 వాళ్ళను విడుదల చేసే వాడు శక్తి గలిగిన వాడు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా. భూమికి విశ్రాంతి కలగజేయడానికీ, బబులోను నివాసుల్లో కలహం పుట్టించడానికీ ఆయన తన ప్రజల పక్షం వహిస్తాడు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.” အခန်းကိုကြည့်ပါ။ |
సీయోను కుమారీ, నీవు బాధపడు. ప్రసవించే స్త్రీలా నీవు నొప్పిని అనుభవించి “బిడ్డను” కను. ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు. నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు. నీవు బబులోను (బాబిలోనియా)కు వెళతావు. కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు. యెహోవా అక్కడికి వెళ్లి, నిన్ను నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.