యిర్మీయా 50:33 - పవిత్ర బైబిల్33 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. “ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిసలై యున్నారు. శత్రువు వారిని చెరబట్టాడు. శత్రువు ఇశ్రాయేలును వదిలిపెట్టడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు –ఒకడును తప్పకుండ ఇశ్రాయేలువారును యూదావారును బాధింపబడిరి వారిని చెరపెట్టినవారందరు వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారితో పాటు అణచివేతకు గురయ్యారు. వాళ్ళను చెర పట్టిన వాళ్ళందరూ వాళ్ళని ఇంకా పట్టుకునే ఉన్నారు. వాళ్ళను విడిచి పెట్టడానికి ఒప్పుకోవడం లేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు. వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు. వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు. အခန်းကိုကြည့်ပါ။ |
నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”