యిర్మీయా 50:29 - పవిత్ర బైబిల్29 “బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి. ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి. ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు. అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి. అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి. బబులోను యెహోవాను గౌరవించలేదు. పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది. కావున బబులోనును శిక్షించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవామీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 “బబులోనుకు రమ్మని బాణాలు వేసే వాళ్ళను పిలవండి. తమ విల్లును వంచే వాళ్ళందరినీ పిలవండి. మీరు దాని చుట్టూ శిబిరం వేయండి. ఎవర్నీ తప్పించుకోనీయవద్దు. ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన పనులను బట్టి ఆమెకూ చేయండి. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను అవమానించింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 “బబులోను మీదికి రమ్మని, విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. ఆమె చుట్టూ చేరండి; ఎవరూ తప్పించుకోకూడదు. ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను ఆమె ధిక్కరించింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 “బబులోను మీదికి రమ్మని, విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. ఆమె చుట్టూ చేరండి; ఎవరూ తప్పించుకోకూడదు. ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను ఆమె ధిక్కరించింది. အခန်းကိုကြည့်ပါ။ |
ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోసగించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడినుండి నేను నిన్ను క్రిందికి దింపుతాను,” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు.