యిర్మీయా 50:24 - పవిత్ర బైబిల్24 బబులోనూ, నీ కొరకు నేను వల పన్నాను. అది నీవు తెలిసికొనే లోపుగానే నీవు పట్టుబడ్డావు. నీవు యెహోవాకు వ్యతిరేకంగా పోరాడావు. అందువల్ల నీవు చూడబడి, పట్టుబడ్డావు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 బబులోనూ, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి యున్నాను తెలియకయే నీవు పట్టబడియున్నావు యెహోవాతో నీవు యుద్ధముచేయ బూనుకొంటివి నీవు చిక్కుపడి పట్టబడియున్నావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 బబులోనూ, నేను నీ కోసం ఒక బోను పెట్టాను. నువ్వు అందులో చిక్కావు. కానీ ఆ సంగతి నీకు తెలియలేదు. యెహోవా అనే నన్ను సవాలు చేశావు. కాబట్టి నిన్ను వెతికి పట్టుకున్నాను.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 బబులోనూ, నీ కోసం ఉచ్చు బిగించాను అది నీకు తెలియకముందే దానిలో చిక్కుకున్నావు. నీవు యెహోవాను వ్యతిరేకించావు కాబట్టి నిన్ను కనుగొని బంధించాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 బబులోనూ, నీ కోసం ఉచ్చు బిగించాను అది నీకు తెలియకముందే దానిలో చిక్కుకున్నావు. నీవు యెహోవాను వ్యతిరేకించావు కాబట్టి నిన్ను కనుగొని బంధించాను. အခန်းကိုကြည့်ပါ။ |
“ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి ఆ మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు.