Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 50:16 - పవిత్ర బైబిల్

16 బబులోను ప్రజలను మొక్కలు నాటనివ్వకండి. వారి పంటను సేకరించనీయవద్దు. బబులోను సైనికులు చాలా మందిని తమ నగరానికి బందీలుగా తీసికొనివచ్చారు. ఇప్పుడు శత్రు సైన్యాలువచ్చాయి. కావున ఆ బంధీలంతా ఇండ్లకు తిరిగి వెళ్లుచున్నారు. ఆ బందీలు తిరిగి తమ తమ దేశాలకు పరుగున పోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమతమ దేశములకు పారిపోవుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 బబులోనులో విత్తనాలు చల్లే వాణ్ణీ, కొడవలి తీసుకుని పంట కోసే వాణ్ణీ ఉండకుండా వాళ్ళను నిర్మూలం చేయండి. క్రూరమైన ఖడ్గానికి భయపడి వారందరు తమ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు తమ తమ దేశాలకు పారిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 బబులోను నుండి విత్తేవారిని, కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. అణచివేసే వారి ఖడ్గం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 బబులోను నుండి విత్తేవారిని, కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. అణచివేసే వారి ఖడ్గం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 50:16
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు బబులోను ప్రజలు గాయపడిన జింకల్లా పారిపోతారు. కాపరి లేని గొర్రెల్లా వారు పారిపోతారు. యుద్ధానికి వచ్చే ప్రతి సైనికుడూ వెనుదిరిగి తన స్వదేశానికి, స్వజనుల దగ్గరకు పారిపోతాడు.


తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు. యెహోవా కోపంగా ఉన్నాడు! యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది! వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.


ఆ సైనికులు పదేపదే తూలిపోతారు. వారొకరి మీద మరొకరు పడతారు. వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం. మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము. మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.


గొర్రెల కాపరులను, మందలను నాశనం చేయటానికి నిన్ను ఉపయోగించాను. రైతులను, ఆవులను నాశనం చేయుటకు నిన్ను ఉపయోగించాను. పాలకులను, ముఖ్య అధికారులను దండించటానికి నిన్ను వాడాను.


బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము. కాని ఆమె స్వస్థతనొందలేదు. కావున ఆమెను వదిలివేసి మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం. వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు. బబులోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.


రైతులారా! విచారించండి. ద్రాక్షాతోట రైతులారా! గట్టిగా ఏడ్వండి. గోధుమ, యవల కోసం ఏడ్వండి! ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.


అందువలన ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు: “బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలపిస్తారు. ప్రజలు వీధులలో రోదిస్తారు. ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ