యిర్మీయా 50:15 - పవిత్ర బైబిల్15 బబులోను చుట్టూ సైనికులు జయ నినాదాలు చేస్తారు. ఇప్పుడు బబులోను లొంగిపోయింది! దాని ప్రాకారాలు, బురుజులు కూలదోయబడ్డాయి! వారికి అర్హమైన శిక్షను యెహోవా ఆ ప్రజలకు ఇస్తున్నాడు. ప్రజలారా, బబులోనుకు తగిన శిక్షను ఇవ్వండి. అది ఇతర దేశాలకు ఏమి చేసిందో, దానిని ఆ రాజ్యానికి తిరిగి చేయండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 చుట్టు కూడి దానినిబట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవాచేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 దాని చుట్టూ నిలిచి జయజయ ధ్వానాలు చేయండి. ఆమె తన అధికారాన్ని వదులుకుంది. ఆమె గోపురాలు కూలిపోయాయి. దాని గోడలు పడిపోతున్నాయి. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అది ఇతర దేశాలకు చేసినట్టే మీరు దానికి చేయండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి. အခန်းကိုကြည့်ပါ။ |
“కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు! ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు. యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది. ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది. అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి. నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమికొడతాను! ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను? నాలాగా మరే వ్యక్తి లేడు. నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు. కావున నేనే ఆ పని చేస్తాను. నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు. నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”
మీ బాణాలకు పదును పెట్టండి. మీ డాళ్లను చేపట్టండి! యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు. ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు. కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు. బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు. బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది. కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.
“అక్కడ అతను కొన్ని సంకేతాలు చూశాడు. అవి అతనిని తన కుడిప్రక్కనున్న యెరూషలేముకు పోయే మార్గంలో వెళ్లమని సూచించాయి! అతడు నగర ద్వారాలు పగులగొట్టే దూలాల యంత్రాలను తేవటానికి సిద్ధం కమ్మనే సంకేతం ఇవ్వాలనుకున్నాడు. అతడు ఆజ్ఞ ఇవ్వగానే అతని సైనికులు మారణకాండకు పూనుకుంటారు. యుద్ధ నినాదాలు చేయమని, నగరపు గోడకు మురికి వీధిని నిర్మించమని, మరియు కొయ్య బురుజులు నగరాన్ని ఎదుర్కోవడానికి నిర్మించమని సంకేతాలు యిస్తాడు.