యిర్మీయా 50:13 - పవిత్ర బైబిల్13 యెహోవా తన కోపం చూపటంతో అక్కడ ఎవ్వరూ నివసించరు. బబులోను నగరం పూర్తిగా ఖాళీ అవుతుంది. బబులోను ప్రక్కగా పోయే ప్రతివాడు భయపడతాడు. అది నాశనం చేయబడిన తీరుచూచి విస్మయంతో వారు తలలు ఆడిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి–ఆహా నీకీగతి పెట్టి నదా? అందురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 యెహోవాకు కలిగిన క్రోధాన్ని బట్టి బబులోను నిర్మానుష్యమవుతుంది. సర్వనాశనమవుతుంది. బబులోను దారి గుండా వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దాని గాయాలను చూసి దాన్ని తిరస్కరిస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. పూర్తిగా నిర్జనమైపోతుంది. బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. పూర్తిగా నిర్జనమైపోతుంది. బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
నీనెవె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా సంతోషంతో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచమంతటిలో నీనెవె పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడుతుంది! అది అడవి జంతువులు పండుకొనేందుకు వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరీతంగా నాశనం చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊవుతూ ఈలలు వేస్తారు.