Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 49:13 - పవిత్ర బైబిల్

13 యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 బొస్రా భయాన్ని కలిగించే స్థలంగానూ, అవమానంగానూ, ఒక శాపవచనంగానూ ఉంటుంది. దాని పట్టణాలన్నీ ఎప్పటికీ నాశనమై ఉంటాయి. ఎందుకంటే నేను నా పేరు చెప్పి ప్రమాణం చేశాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 49:13
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నేను నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే,


బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.


బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు.


ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు.


“నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు.


ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు? ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు. అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు. అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు. “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను” అని అతడు చెబుతున్నాడు.


యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది! ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు. ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!


ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం చెందుతారు.


కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా, యెహోవా సందేశాన్ని వినండి: ‘మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా” అని వారు చెప్పరు.


కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది. మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.


దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు. బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు. ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు. ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.


సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు, “బబులోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు సైనికులతో నింపుతాను. వారు మిడుతల దండులా వచ్చి పడుతారు. ఆ సైనికులు యుద్ధంలో నీ మీద గెలుస్తారు. వారు నీపై నిలబడి విజయధ్వనులు చేస్తారు.”


ఈజిఫ్టు ఖాళీ అవుతుంది. ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది. ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు క్రూరంగా ఉన్నారు. వారి దేశంలోని నిర్దోషప్రజలను వారు చంపివేశారు.


కావున తేమానులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రాలో ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”


ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు: “యాకోబుకు గర్వకారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను. అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను. అందుచేత ‘శత్రువు’ నగరాన్ని, దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”


యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది. యోసేపు సంతతివారు మంటలా తయారవుతారు. కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది. యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు. యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు. అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికినవాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.” దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ