Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 48:9 - పవిత్ర బైబిల్

9 మోయాబు పొలాలపైన ఉప్పు చల్లుము. దేశం వట్టి ఎడారి అయిపోతుంది. మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి. వాటిలో ఎవ్వరూ నివసించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడునులేకుండ దాని పట్టణములు పాడగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 మోయాబు ఎగిరి పోవాల్సి ఉంది. దానికి రెక్కలు ఇవ్వండి. ఆమె పట్టణాలు వ్యర్ధభూమి అవుతాయి. అక్కడ ఎవ్వరూ నివసించరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే, అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది; నివసించేవారు లేక, దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే, అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది; నివసించేవారు లేక, దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 48:9
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు? “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!


ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.


మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు. సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు. వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు.


తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు.


ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి. బందీలై పోవటానికి సిద్ధమవండి. ఎందువల్లనంటే, నోపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది. నగరాలు నాశనమవుతాయి. వాటిలో ఎవరూ నివసించరు!


మోయాబు ప్రజలారా, మీ పట్టణాలను వదిలిపెట్టండి. వెళ్లి గుట్టల్లో నివసించండి. గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”


కనుక నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు మరియు అమ్మోను ప్రజలు సొదొమ, గొమొర్రాల్లా నాశనం చేయబడతారు. నేను ఇశ్రాయేలీయుల దేవుడను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా సర్వనాశనం చేయబడతాయని నేను వాగ్దానం చేస్తున్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి పొతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించినవారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ తీసుకొంటారు.”


ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ