5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు. వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు. హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను, బాధతోను కూడిన రోదన వినిపించగలదు.
మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది. ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు. దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు. ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు. ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.