Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 48:33 - పవిత్ర బైబిల్

33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి. గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను. రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి వారి అలరింతలు అంతమయ్యాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమునులేకుండచేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 కాబట్టి మోయాబు దేశంలో నుండి పళ్ళ చెట్ల మూలంగా కలిగే సంతోషమూ, సంబరమూ తొలగిపోయాయి. ‘వాళ్ళ ద్రాక్ష గానుగల్లో ద్రాక్షారసానికి నేను ముగింపు పలికాను. వాళ్ళు గానుగలో ద్రాక్షలు తొక్కేటప్పుడు ఆనందంతో కూడిన కేకలు వినిపించవు. వినిపించే కేకల్లో ఆనందం ఉండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 48:33
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”


ఈ దేశంలో వెయ్యేసి ద్రాక్షావల్లులు ఉన్న పొలాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక్కో ద్రాక్షావల్లి వెయ్యి వెండి నాణాల విలువ చేస్తుంది. కాని ఈ పొలాలు గచ్చపొదలు, బలురక్కసి చెట్లతో నిండిపోతాయి.


దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు. అది కోతకాలపు సంతోషంలా ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది.


మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయంనుండి ఆనందం, సంతోషం పోయాయి.


మద్యపాన మత్తులారా, మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే, మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపోయింది. ఆ ద్రాక్షామద్యం మరో గుక్కెడు మీకు దొరకదు.


ద్రాక్షాతోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు. ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” అని యెహోవా చెపుతున్నాడు.


ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ