యిర్మీయా 48:19 - పవిత్ర బైబిల్19 “అరోయేరు నివాసులారా, దారి ప్రక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి. పారిపోయే మనిషిని చూడండి. పారిపోయే స్త్రీని చూడండి. ఏమి జరిగిందో వారిని అడగండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అరోయేరులో నివసించే వాళ్ళు దారిలో నిలబడి గమనించండి. తప్పించుకుని పారిపోతున్న వాళ్ళని ‘ఏం జరిగింది’ అని అడగండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అరోయేరులో నివసించేవారలారా, రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి. పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని, ‘ఏమైంది?’ అని అడగండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అరోయేరులో నివసించేవారలారా, రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి. పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని, ‘ఏమైంది?’ అని అడగండి. အခန်းကိုကြည့်ပါ။ |
హెష్బోను పట్టణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరోయేరు పట్టణంలోను, దాని చుట్టూరా ఉన్న ఊళ్ళలోను మూడువందల సంవత్సరాలు నివసించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్టణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతటిలోనూ ఈ పట్టణాలను తీసుకునేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయలేదు?