యిర్మీయా 47:2 - పవిత్ర బైబిల్2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 –యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి. ఉత్తర దిక్కున నీళ్ళు వరదలా పొర్లి పారుతున్నాయి. వాళ్ళు వెల్లువలా పొంగిన నదిలా ఉంటారు. తర్వాత వాళ్ళు దేశం పైనా, దాని పట్టణాల పైనా, దానిలో నివాసముండే వాళ్ళ పైనా వెల్లువలా ప్రవహిస్తారు! కాబట్టి అందరూ సహాయం కోసం మొర్ర పెడతారు. దేశంలోని ప్రజలందరూ విలపిస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |
“ఒక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి మనుష్యులు మట్టపుగుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. అదే విధంగా ఏది సరైనదో చూపించేందుకు నేను న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్ధాలు, మాయల వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది ఉంటుంది.