Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 46:7 - పవిత్ర బైబిల్

7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 46:7
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల సువాసనలతో పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.


ఎడారి మార్గంలో, తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఈ స్త్రీ ఎవరు? జల్దరు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నిన్ను మోసిన నీ తల్లి నిన్ను కన్నది.


ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు? ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు. అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు. అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు. “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను” అని అతడు చెబుతున్నాడు.


యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.


“నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు: “‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు. కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా. నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు. నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు. నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”


“ఉత్తర రాజు కుమారులు యుద్ధ సన్నద్ధులై ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుతారు. ఆ సైన్యం ఆ ప్రదేశంగుండా గొప్ప ప్రవాహంవలె దక్షిణ రాజు యొక్క బలమైన దుర్గం వరకు యుద్ధం సాగిస్తుంది.


ప్రవాహంలాంటి ఆ సైన్యాలు వాని ఎదుటనుండి తుడిచి వేయబడతాయి. ఒప్పందం కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు.


అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు చంపబడతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.


ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది. దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు. ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది. భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”


ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ