5 నేనేమిటి చూస్తున్నాను? ఆ సైన్యం భయపడింది! సైనికులు పారిపోతున్నారు. ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు. వారు తత్తరపడి పారిపోతున్నారు. వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు. ఎటు చూచినా భయం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
5 ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
5 నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
5 నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”
ప్రతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవవేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టిస్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. ఈ భయంచూపులు వారి పొరుగువారందరి ముఖాలమీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య పడతారు.
ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు.
కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు. బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబుతారు. ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు. కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”
అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.
అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను. ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను. నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు. “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం! లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు! అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు. తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు. లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు.
ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు. అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు. శత్రు దాడికి వారు తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు. ‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.
కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను. మీరంతా పారిపోతారు. మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”
నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ఝుళిపించడానికి మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా భయపడతారు. నీవు పతనమైన రోజున ప్రతిక్షణం రాజులు భయంతో కంపించి పోతారు. ప్రతీ రాజూ తనభద్రత కొరకు భయపడతాడు.”
బలాఢ్యులైన సైనికుల శరీరాల మాంసం మీరు తింటారు. మహా రాజుల రక్తాన్ని మీరు తాగుతారు. బాషానుకు చెందిన పొట్టేళ్లు, గొర్రె పిల్లలు, మేకలు, బలిసిన గిత్తల్లా వారుంటారు.
నీరు బయటకు కారిపోతే ఉండే ఒక మడుగులా నీనెవె నగరం ఉంది. ప్రజలు, “ఆగండి! పారిపోవటం మానండి!” అని అరుస్తారు. కాని ఎవ్వడూ ఆగడు. వారు చెప్పేదాన్ని ఎవ్వరూ. లక్ష్యపెట్టరు!
యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన సైనికులు కూడ ఏడుస్తారు!