యిర్మీయా 46:27 - పవిత్ర బైబిల్27 “నా సేవకుడవైన యాకోబూ, భయపడవద్దు. ఇశ్రాయేలూ, బెదరవద్దు. ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను. యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి. అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నానువారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించు చున్నాను ఎవరి భయమునులేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 “కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలూ, కలవరపడకు. నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలూ, కలవరపడకు. నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు. အခန်းကိုကြည့်ပါ။ |
మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను.