యిర్మీయా 46:10 - పవిత్ర బైబిల్10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు! ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు. యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహో వాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరి గింప బోవుచున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు. కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది. యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |
ఈ వర్తమానం ఈజిప్టు దేశాన్ని గురించి చెప్పబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నదీతీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:
దేవుడు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: ‘అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘చూడండి, ఒక ఖడ్గం! ఆ ఖడ్గం దాని ఒరనుండి బయటకు వచ్చింది. కత్తి మెరుగు దిద్దబడింది! కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది. అది మెరుపు తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది!