యిర్మీయా 44:23 - పవిత్ర బైబిల్23 అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో మీ బాధ్యతను మీరు విస్మరించారు.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.” အခန်းကိုကြည့်ပါ။ |
ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.”
విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి.